సారథి న్యూస్, హుస్నాబాద్: రంగనాయక్ సాగర్ కెనాల్ భూసేకరణపై ఆర్డీవో జయచంద్రారెడ్డి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందులపూర్ గ్రామంలో నిర్మించిన రంగనాయక్ సాగర్ జలాశయం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి పంటలకు సాగునీరు విడుదల కానుందన్నారు. కెనాల్ ద్వారా కొహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని రైతుల భూముల గుండా పోతుందన్నారు. కెనాల్ కు రైతులు భూములు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతం పంటపొలాలతో సస్యశ్యామలం అవుతుందన్నారు. అధికారులు చేస్తున్న భూసేకరణ ప్రక్రియను అడ్డుకోవద్దని కోరారు. నష్టపరిహారంతో పాటు నిర్ణయ అవార్డు పాస్ చేస్తామని ఆర్డీవో హమీఇచ్చారు. సమావేశంలో ఆర్డీవో ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కిషన్ సింగ్, సీనియర్ సహాయకులు ఎల్లయ్య, బస్వాపూర్ గ్రామరైతులు తదితరులు పాల్గొన్నారు.
- September 25, 2020
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- BASWAPUR
- HUSNABAD
- RANGANAYAKA SAGAR
- SIDDIPETA
- బస్వాపూర్
- రంగనాయకసాగర్
- సిద్దిపేట
- హుస్నాబాద్
- Comments Off on రంగనాయక సాగర్.. భూసేకరణకు సహకరించండి