సారథి న్యూస్, హుస్నాబాద్/ రామడుగు/గోదావరిఖని: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. యోగాతో అనేక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, యోగా టీచర్ అనితారెడ్డి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగాసనాలు వేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగులో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో యోగాసనాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు రోజు గంటసేపు యోగా చేయడం వల్ల ఆనారోగ్యం దరి చేరదని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు కుటుంబ సమేతంగా యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏసీపీ ఉపేందర్, గోదావరిఖని వన్‌టౌన్ సీఐ రమేష్, యోగ గురవులు సుధాజీ, సుజాత కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, నారాయణదాసు మారుతి, ఆడప శ్రీనివాస్, చల్లగురుగుల మెగిళి, నూతి తిరుపతి పాల్గొన్నారు.
- June 21, 2020
- Archive
- తెలంగాణ
- HEALTH
- KARIMNAGAR
- YOGA
- యోగా
- విద్యావంతులు
- Comments Off on యోగాతో రోగాలు దూరం