Breaking News

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ డిమాండ్ ​చేశారు. ఉత్తరప్రదేశ్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలకు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించలేని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ను బర్తరఫ్​చేయాలని డిమాండ్ ​చేశారు. హత్రాస్​లో దళిత యువతిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ.. శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లా కేంద్రంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారతరత్న డాక్టర్ ​బీఆర్ ​అంబేద్కర్ ​విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా బాధితురాలు మృతదేహాన్ని దహనం చేసిన పోలీసులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉత్తరప్రదేశ్​లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ ​చేశారు. అనంతరం కలెక్టరేట్​ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, జిల్లా కార్యదర్శి గడ్డమీది వెంకటయ్య, పార్లమెంట్​ కోఆర్డినేటర్ ​యేసేపు, షఫీ, నాగర్​కర్నూల్ ​అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు బండి పృథ్వీరాజ్, కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజనేయులు, కొల్లాపూర్ ​నియోజకవర్గ అధ్యక్షుడు మునిస్వామి, జైభీం శంకర్, కొట్ర బాలు, నల్లవెల్ల ఉపసర్పంచ్​ నాగేష్​, విష్ణు, నాగరాజు, రాంచందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.