Breaking News

యూకేపై చైనా సీరియస్‌

యూకేపై చైనా సీరియస్‌

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న ఉద్రిక్తతలపై యూకే స్పందించడంతో డ్రాగన్‌ వారిపై సీరియస్‌ అయింది. ఈ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని చెప్పింది. సరిహద్దుల వెంట నెలకొన్న పరిస్థితులను చర్చలతో పరిష్కరించుకుంటామని చెప్పింది. పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలనే విషయం తమకు బాగా తెలుసని, అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పింది. దాంతో పాటు హాంకాంగ్‌ విషయంలో కూడా ఎవరి జోక్యం అవసరం లేదని సీరియస్​ అయింది. పాంగాంగ్‌, గోగ్రా పోస్ట్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు ఒప్పుకోలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో బ్రిటిష్‌ హై కమిషన్‌ టు ఇండియా ఫిలిప్‌ బార్టన్‌ అన్నారు. ప్రపంచానికి సవాళ్లు విసురుతూ, ఇంటర్నేషనల్‌ లా ను ఉల్లంఘిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న చైనాకు బుద్ధి చేప్పేందుకు మిత్రపక్షాలతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్‌ రెడీగా ఉందని అన్నారు. దీంతో ఈ విషయంపై చైనా యూకేకు వార్నింగ్‌ ఇచ్చంది. యూకే హాంకాంగ్‌ విషయంలో కూడా చైనాపై కామెంట్స్‌ చేయడంతో ఆ విషయంపైనా యూకేపై సీరియస్‌ అయింది.