సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వం కొనుగోలు చేసిన యంత్రాలను అధికారులు నిరుపయోగంగా పడేశారని కాంగ్రెస్ నేత అక్కు శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు పనుల్లోని మోటర్లకు ఉపయోగించేందుకు స్విచ్చింగ్ యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయగా వాటిని అధికారులు హుస్నాబాద్‌లోని నివాసప్రాంతాల్లో ఉంచారని ఆరోపించారు. వాటిని వెంటనే వినియోగించాలని.. లేదంటే కంపెనీలకు వాపస్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు.
- July 5, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- GANDIPALLY
- GOVERNMENT
- HUSNABAD
- KARIMNAGAR
- అధికారులు
- నిరుపయోగం
- Comments Off on యంత్రాలు.. ఎండకు, వానకు