న్యూఢిల్లీ: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సైనికుల్లో చాలా ధైర్యం నింపిందని ఐటీబీపీ చీఫ్ ఎస్ ఎస్.దేశ్వాల్ అన్నారు. ‘ప్రధాని పర్యటన సైనికుల్లో చాలా ధైర్యాన్ని నింపింది. ఆయన ప్రసంగం చాలా బలాన్ని ఇచ్చింది. దేశంలోని పొలిటికల్ లీడర్ షిప్, ఆర్మీ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారు. వాళ్లంతా సరిహద్దు భద్రతకు అంకితమయ్యారు. భారత సైన్యం, వైమానిక దళం, ఐటీబీపీలోని సైన్యానికి మనోధైర్యం చాలా ఎక్కువ’ అని ఢిల్లీలో అతిపెద్ద కొవిడ్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో దేశ్వాల్ అన్నారు. ఇండియా చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాని మోడీ లేహోలో పర్యటించి సైనికులతో మాట్లాడారు. గాల్వాన్ ఘటనలో గాయపడిన వారిని ఆయన పరామర్శించి వారితో మాట్లాడారు.
- July 5, 2020
- Archive
- జాతీయం
- BOARDER
- CHINA
- INDIA
- ఆర్మీ
- ఐటీబీపీ
- ప్రధాని మోడీ
- Comments Off on మోడీ పర్యటన ధైర్యం నింపింది