న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది.తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో 66 శాతం మంది మోడీ పాలన బాగుందని , తర్వాత కూడా ఆయనే ప్రధానిగా ఉండాలని కోరుకున్నారు. రాహుల్‌గాంధీ ప్రధానిగా ఉండాలని 8 శాతం మంది, సోనియా ప్రధాని కావాలని కేవలం 5 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. నాలుగు శాతం మంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, మూడు శాతం మంది యోగి ఆదిత్య నాథ్ ను, 2 శాతం మంది మమతా బెనర్జీని తదుపరి పీఎంగా చూడాలనుకుంటున్నారట. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే నిర్వహించారు.
- August 8, 2020
- Archive
- Top News
- జాతీయం
- MODI
- PRIMEMINISTER
- SURVEY
- ఇండియాటుడే
- నరేంద్రమోదీ
- ప్రధాని
- Comments Off on మోడీ క్రేజ్ అస్సలు తగ్గలేదు