Breaking News

మొగిపురుగును నివారించండిలా..

సారథిన్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటను మొగిపురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు నరేశ్​, రవి పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మెదక్​ జిల్లా రామాయంపేట మండలంలోని జెడ్​ చెర్వు, బచ్చురాజ్ పల్లి, నందిగామ గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి పంట లో మొగిపురుగు నివారణకు నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని సూచించారు. అగ్రిమైసిన్ 0.4 గ్రామ్ లేదా క్లోరిఫైరిఫాస్ 2 ఎం ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని కోరారు. అలాగే పత్తి పంట లో రసం పీల్చు పురుగుల నివారణకు ప్లోనీకామిడ్ 75 గ్రాము ఎకరానికి మరియు సూక్ష్మ పోషకాల లోపాల కోసం ఫార్ములా 4 ను పిచికారీ చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తల వెంట నిజాంపేట వ్యవసాయ అధికారి సతీశ్ తదితరులు ఉన్నారు.