క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొగల్ సామ్రాజ్యపు రోజులను ప్రతిబింబించేదిగా ఉంటుదట ఈ చిత్రం. అయితే ఈ సినిమాలో దేశానికి కాబోయే రాణి.. యువరాణిగా పాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తోందట. యువరాణిగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో తను ఆకస్మాత్తుగా చనిపోతుందట. సినిమాలో ఈ ఎమోషన్ సీన్లకు చాలా ప్రాధాన్యం ఉంటుందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోయే ఈ చిత్రం మొఘలుల కాలంలో అత్యంత ఖరీదైన ఒక నిధిని దొంగలించేందుకు వెళ్లగా అక్కడ పవన్ కు పరిచయం అవుతుందట ఈ బ్యూటీ. సెకెండ్ హాఫ్‌లో మాత్రమే కనిపించే శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ పాత్రకు మంచి హైప్ ఉంటుందట ఈ చిత్రంలో.
‘సాహో’ సినిమాలో ప్రభాస్ తో స్టెప్ కలిపి బ్యాడ్ బోయ్స్ అంటూ పాడి తెలుగు వాళ్లకు పరిచయమైనా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది జాక్వెలిన్. బాలీవుడ్ పై కూడా మంచి పట్టున్న డైరెక్టర్ క్రిష్.. యువరాణిగా జాక్వెలిన్ అయితే చిత్రానికి కూడా జాతీయ స్థాయి క్రేజ్ వచ్చే అవకాశం ఉందని.. ఆ పాత్రకు ఆమెను అడిగారట. వెంటనే ఒప్పుకుందని సమాచారం. అయితే ఈ విషయాల పై అధికారిక వివరాలేమీ ఇంకా రాలేదు. ఇదే నిజమైతే ఈ శ్రీలంక ఒకప్పటి మిస్ యూనివర్స్ జాక్వెలిన్ త్వరలోనే వెండితెరపై కూడా యువరాణిగా కనిపించనుడటం ఖాయం అంటున్నారు.