మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కు మెగా మనసు ఉంటుందని మరోసారి నిరూపించారు రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల. ఆమె కొన్ని రోజుల క్రితం శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారట. ఈ నేపథ్యంలో ఉపాసన తన టీమ్‌తో నల్లమల అటవీ ప్రాంతాలలో చెంచు గూడేలను సందర్శించారు. ఆ గూడెంలోని ప్రజల సంస్కృతి వారి జీవన విధానానికి ఆమెంతో మురిసిపోయారు. వారితో పంచుకున్న విషయాలు..ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాతో పంచుకుంటూ.. అక్కడి రెండు మేక పిల్లలను ఎత్తుకుని ఉన్న ఫొటోలు కూడా షేర్ చేసింది. అంతేకాదు ఆ గూడెం ప్రజల గురించి కొన్ని విషయాలు చెబుతూ..
‘ఈ బుజ్జి మేకలు కొన్నాళ్ల తర్వాత చెంచు గిరిజనులకు రుచికరమైన ఆహారంగా మారిపోతాయేమో..’ అంటూ..‘ప్రజల ఆహారపు అలవాట్లను వారి సంస్కృతిని అర్థం చేసుకోవడం గౌరవించడం నేర్చుకుంటున్నాను. ఈ చెంచులు నిజంగా అద్భుతమైన ప్రజలు. ప్రకృతి మాత పట్ల వారి ప్రేమ నిరుపమానం. అయితే మన నమ్మకాలు అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ఇది తగిన సమయం కాదు. మాంసం తినండి.. కానీ మితంగా! మనకు ఈ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుని మసలుకుందాం. అందుకే ఎంపిక చేసుకున్న ఆహారం తీసుకుందాం. మన భూమండలానికి మనకు అవసరమైనంత మేర నైతికతతో కూడిన ఆహారపు అలవాట్లకు సంబంధించి సందేశాన్ని వ్యాప్తి చేద్దాం..’అంటూ ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాసన పోస్టర్లకు రాంచరణ్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.