అందం, అభినయం రెండూ కలగలసి ఉండేవాళ్లు చాలా కొద్దిమందే ఉంటారు. వారిలో నిత్యామీనన్ ఒకరు. ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ మలయాళ కుట్టి. అతికొద్ది కాలంలోనే తమిళం, తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే కొద్దికాలంగా నిత్య సినిమాలు ఎక్కువగా చేయడం లేదు. దానికి కారణం ఆమెకు నచ్చిన పాత్రలు రాకపోవడమే అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ గ్యాప్ నిత్య కావాలని తీసుకుందట. ఎందుకంటే ఆమెకు దర్శకత్వం వైపు వెళ్లాలని ఉందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అంతేకాదు లాక్ డౌన్ సమయంలో కొత్త కథలు ప్రిపేర్ చేస్తున్నానని కూడా చెప్పింది. నిజంగానే నిత్య రెండు కథలను సిద్ధం చేసుకుందట. అందులో ఓ కథకు నిర్మాత కూడా దొరికాడట. త్వరలోనే ఆమె తన కథతో సెట్స్‌పైకి వెళ్తుందని టాక్.
నిత్య ఈ లాక్ డౌన్ సమయంలో పనిలో పనిగా బరువు తగ్గడంలో కూడా కసరత్తులు చేసిందట. ఇప్పుడామె సినిమాలో నటించడమే కాదు డ్రీమ్ ప్రాజెక్ట్ దర్శకత్వాన్ని కూడా నిర్వహిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరించనుందట. ఇక ఆ సినిమాను ఒక్క భాషకే పరిమితం చేయకుండా పాన్ సౌత్ ఇండస్ట్రీ ఫిల్మ్ గా రూపొందించే ఆలోచనలో ఉందని టాక్. అంతేగాక ఈ మూవీలో ఒక్కో భాషకి ఒక్కో హీరో ఎంట్రీ ఇవ్వనున్నారట. నిత్య ఒక్కసారే భారీ బాధ్యతలు ఎత్తుకోవడం చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు సినీ విశ్లేషకులు..