Breaking News

మెగా పెళ్లిసందడి

మెగా పెళ్లిసందడి

నటుడు నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబసభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో జొన్నలగడ్డ వెంకటచైతన్య మూడుముళ్లు వేశాడు. చైతన్యతో ఏడడుగులు నడిచిన కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఇంటి కోడలు అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాబై చూడముచ్చటైన జంటగా కనిపిస్తున్నారు. పెళ్లి వేడుకల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తో పాటు మొత్తం మెగా ఫ్యామిలీ హాజరైంది. కూతురు వివాహం చూసి భావోద్వేగానికి లోనైనయ్యారు నాగబాబు. పెళ్లికూతురుగా ముస్తాబైన తన కూతురు ఫొటోను షేర్ చేస్తూ ‘తను స్కూలుకు వెళ్లిన మొదటిరోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంది’ అంటూ నాగబాబు సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ పంచుకున్నారు.