మెగా ఫ్యామిలీ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్‌మెంట్ అరెంజ్మెంట్స్ రెడీ అవుతున్నాయి. బుల్లితెర షోస్ కు హోస్ట్ గానే కాదు వెండితెర హీరోయిన్గా కూడా అలరించి.. వెబ్ సిరీస్ లతోనూ రాణిస్తోంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్ కొడుకు చైతన్యతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి.
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం కుదిరినట్టు తెలుస్తోంది. ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య హైదరాబాద్ లోనే ఓ ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడట. అయితే నిహారిక పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుందని నాగబాబు ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రీసెంట్ గా నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్ ను ఆమె సోదరుడు వరుణ్ తేజ్ రివీల్ చేశాడు. ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని క్లారిటీ ఇచ్చాడు. పెళ్లి కూడా ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, స్వాతిని దర్శకత్వంలో అశోక సెల్వన్ హీరోగా వస్తున్న ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది నిహారిక.