మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా పూర్తి కాగానే మెగాస్టార్ ‘లూసీఫర్’ చిత్రాన్ని చేయనున్నారు. ఈ మూవీ చెయ్యాలని చాలా ఆసక్తి ఉందని చిరంజీవి గతంలో పేర్కొన్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన‘లూసీఫర్’ అక్కడ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు కీలక పాత్రలో మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కీలకమైందే కాదు చాలా పవర్ ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం యంగ్ హీరోయిన్స్ కాకుండా సీనియర్స్ అయితేనే బాగుంటుందని చాలామంది సీనియర్ హీరోయిన్స్ లిస్టలు తయారు చేసారు. మొదట్లో విజయశాంతి, సుహాసిని అనుకున్నారు. అయితే వాళ్లిద్దరూ మెగాస్టార్ సరసన హీరోయిన్స్ రోల్స్ పోషించారు కనుక అక్కగా, చెల్లిగా అంత బాగుండదు కనుక ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు తాజాగా ఆ పాత్రకు ఖుష్బు అయితే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి అక్కగా ఖుష్బు నటించింది. ఇప్పుడు చెల్లి పాత్ర అయితే ఎలా ఉంటుందో అని అనుమానించే వారికి.. ఖుష్బని గతంతో పోల్చితే ఇప్పుడు చాలా బరువు తగ్గి పదేళ్ల వయసు తగ్గినట్లుగా కనిపిస్తోంది. కానీ ఇంకా ఖుష్బు వార్త పై కూడా చిత్రబృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా కుష్బూ ‘లూసిఫర్’లో ని చెల్లి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హీరో పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఎమోషనల్ రోల్ లో కుష్బూ పూర్తి న్యాయం చేయగలదు అంటున్నారు.. పైగా మెగాస్టార్ కి గతంలోనూ కుష్బూ సిస్టర్ గా నటించింది. ఆ కారణంతోనే ఖుష్బు చిత్రంలో ఆ పాత్రకు చిరంజీవి సిఫార్సు చేసి ఉంటాడు అనేది టాక్. ఈ చిత్రానికి ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు నెటివిటీకి దగ్గరగా ఉండేలా ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేశారట. ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వర్షన్ ను రాస్తుండగా.. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.