సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరం నలుదిశలా విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు పౌరసేవల పర్యవేక్షణ, మున్సిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో పలు కీలక కూడళ్లలో ఆధునిక సాంకేతికతను జోడించిన సీసీ కెమెరాలను అమర్చనున్నారు. చెన్నైకు చెందిన అనలాగ్ అండ్ డిబిటల్ లాబ్స్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు షురూ అయ్యాయి. ఈ మేరకు మంగళవారం నగరంలోని కొండారెడ్డి బురుజు, రాజ్ విహార్, బళ్లారి చౌరస్తా, హైవే, ఐటీసీ కూడళ్లను మున్సిపల్ కార్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ, ట్రాఫిక్ డీఎస్పీ మహబూబ్ బాషా పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నజేషన్ సిస్టమ్ ద్వారా వాహనం నంబర్ ప్లేట్ అనుమానాస్పదంగా ఉన్నా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. నిర్దేశించిన స్పీడ్ కన్నా అధిక వేగంతో వచ్చినా పసిగట్టవచ్చన్నారు. అంతేకాకుండా నగర పాలక సంస్థ సేవలను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే స్పష్టంగా పర్యవేక్షించవచ్చని చెప్పారు. నగర పాలక సంస్థ డీరాధాకృష్ణ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- August 4, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- AP POLICE
- CIRCLES
- Kurnool
- TRAFFIC
- కమిషనర్
- కర్నూలు
- సీసీ కెమెరా
- Comments Off on మూడో కన్ను.. నాలుగు దిక్కులా