Breaking News

మూడుభాషల విధానం మాకొద్దు

మూడు భాషల విధానం మాకొద్దు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యావిధానాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తమిళనాడు సీఎం కే పళనిస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు తమ రాష్ట్ర ప్రాంతీయభాషతో పాటు హిందీ, ఇంగ్లీష్​ లాంగ్వేజ్​లను పెట్టాలన్న నిబంధన ఉందని, అది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన తెలిపారు. తమిళనాడులో విద్యార్థులకు తమిళం, ఇంగ్లీష్​ మాత్రమే బోధిస్తున్నామని ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం చెప్పినట్టుగా హిందీని మూడో లాంగ్వేజ్​గా ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించివేయడం సరికాదన్నారు. బలవంతంగా తమపై హిందీని రుద్దవద్దని ఆయన సూచించారు. కాగా, తమిళనాడులో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.