Breaking News

మురళీధరన్​గా విజయ్​ సేతుపతి

తన స్పిన్​ మాయజాలంతో ప్రపంచ క్రికెట్​ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీలంక దిగ్జజ బౌలర్​ ముత్తయ్య మురళీధరన్​ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్నది. తమిళనటుడు విజయ్​ సేతుపతి ఈ చిత్రంలో మురళీధరన్​ పాత్రను పోషించబోతున్నాడు. మురళీధరన్​ బౌలింగ్​ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతడి బౌలింగ్​ అంటే ప్రముఖ ఆటగాళ్లు సైతం వణికిపోతుంటారు. కీలకసమయంలో వికెట్లు పడగొట్టి జట్టును గట్టెంకించడం మురళీధరన్​ ప్రత్యేకత. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో 800 వికెట్లు తీసిన వైనానికి సంకేతంగా దీనికి ఆ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దార్ మోషన్ పిక్చర్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.