శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. ఆ ముగ్గురు జైషే మహ్మద్ టెర్రర్ గ్రూప్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఒక వ్యక్తి ఐఈడీ ఎక్స్‌పర్ట్ అని పోలీసులు అన్నారు. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సెక్యూరిటీ ముగ్గుర్ని మట్టుబెట్టారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్‌తో చాలా ఎటాక్స్‌కు ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వలీద్ అనే టెర్రరిస్టు పాకిస్తాన్‌కు చెందిన వాడిగా గుర్తించామని అన్నారు. ఆ వ్యక్తి ఇప్పటి వరకు నాలుగు సార్లు తప్పించుకున్నాడని, చివరకు శుక్రవారం ఉదయం మట్టుబెట్టామని ఇన్స్‌పెక్టర్ విజయ్‌కుమార్ చెప్పారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి దెబ్బలు తగిలాయని, వారిని ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు
- July 17, 2020
- Archive
- Top News
- జాతీయం
- ENCOUNTER
- JAMMU
- MORNING
- TERRORISTS
- ఉగ్రవాదులు
- కుల్గామ్
- Comments Off on ముగ్గురు టెర్రరిస్టులు హతం