కొంతకాలంగా బాలీవుడ్ నటులపై అక్కడి డ్రగ్మాఫియాపై కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబై సిటీ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదని కూడా కామెంట్ చేసింది. కాగా కంగనా ఆరోపణలపై శివసేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘కంగనాకు ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ఆమె ముంబై రావొద్దు. కానీ ఇక్కడి ప్రభుత్వం, పోలీసులపై ఆమె లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం శివసేన ఆమెను క్షమించదు. కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వబోం’ అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అధికార పత్రిక ‘సామ్నా’ లో సంపాదకీయం రాశారు. కాగా ఈ వ్యాఖ్యలపై కంగన ఫైర్అయ్యింది. `ముంబై రావొద్దని కొందరు నన్ను హెచ్చరిస్తున్నారు. కానీ నేను ముంబై వస్తా. ఈ నెల 9న నేను ముంబై రావాలని నిర్ణయించుకున్నా. విమానశ్రయంలో ఎప్పుడు దిగుతానో టైమ్ కూడా ముందుగానే చెబుతా.. దమ్ముంటే నన్ను ఆపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శివసేన దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
- September 4, 2020
- Archive
- Top News
- సినిమా
- BOLLYWOOD
- DRUGS
- KANGANA
- MUMBAI
- SHIVSENA
- TWWET
- ఎయిర్పోర్ట్
- కంగనారనౌత్
- బాలీవుడ్
- ముంబై
- శివసేన
- Comments Off on ముంబై వస్తున్నా.. చేతనైతే అడ్డుకోండి