ముంబై: ముంబై పోలీసులపై మహారాష్ట్ర మాజీసీఎం ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముంబై నగరం మానవత్వాన్ని కోల్పోయింది. ఇక్కడి పోలీసుల తీరు బాధ్యతారాహిత్యాన్ని తలపిస్తుంది. వీరంతా నిజానిజాలను పక్కనపెట్టి అధికారంలో ఉన్నవారికి కొమ్ము కాస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలితో ముంబైలో బతకడం అంత సురక్షితం కాదేమో అనిపిస్తుంది’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ కేసులో మహారాష్ట్ర, బీహార్ పోలీసుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అమృత వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా అమృత వ్యాఖ్యలపై శివసేన, ఎన్సీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని శివసే ఎంపీ ప్రియాంక చతుర్వేదీ పేర్కొన్నారు. అమృత తన భద్రత కోసం ప్రభుత్వం నియమించిన పోలీసులను వెనక్కి పంపించాలని.. సొంత గార్డ్స్‌ను నియించుకోవాలని ఆమె సూచించారు.