నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరితో ‘చూసీ చూడంగానే’ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించిన వర్ష బొల్లమ్మ తమిళ్ సూపర్ హిట్స్ విజిల్, 96 సినిమాల్లో కూడా నటించింది. ‘విజిల్’ డబ్బింగ్ సినిమాలోనూ ‘96’ తెలుగు రీమక్ ‘జాను’ లోనూ నటించి ఇక్కడా గుర్తింపు తెచ్చుకుంది వర్ష. దీంతో టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ చిత్రంలో నటిస్తోంది.
వినోద్ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. క్యూట్ లుక్స్ తో చుడీదార్ లో ఉన్న ఆమె ఫొటోను షేర్ చేస్తూ..‘ఆమె అద్భుతమైన నటనతో చాలా త్వరగా ప్రేమలో పడతారు’ అంటూ కామెంట్ కూడా చేశాడు ఆనంద్. దీనికి వర్ష ‘థాంక్యూ ఆనంద్..’ అని రిప్లై కూడా ఇచ్చింది. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయిన ఈ చిత్రంలోని నటీనటులు గుంటూరు భాష యాసలోనే మాట్లాడతారని, త్వరలోనే రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని టీమ్ వెల్లడించింది.