Breaking News

మిడతల దండును అడ్డుకుందాం

సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గురువారం సీఎం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​రెడ్డి, ముఖ్యకార్యదర్శులు బి.జనార్దన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. ఫైరింజన్లు, జెట్టింగ్​ మిషన్లు, పెస్టిసైడ్స్​ను సిద్ధం చేసినట్లు చెప్పారు. మిడతల దండు కదలికను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అవి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, సీసీఎఫ్ శోభ, సీనియర్​ అధికారులు రాహుల్ బొజ్జా, సంజయ్ కుమార్ జైన్ . ప్రవీణ్ రావు, విప్​ బాల్క సుమన్. లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.