Breaking News

మాస్​ మహారాజా.. అదే గెటప్

రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమా గుర్తుందా మీకు. ఆ సినిమా మరచిపోలేని వాళ్లంటూ ఎవరూ ఉండరేమో. కానీ రాజమౌళి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాకు అప్పుడే 14 ఏళ్లు నిండుతున్నాయి. కానీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటూ పోలీస్ గెట్​లో రవితేజ మీసం మెలివేస్తూ చెప్పే డైలాగ్ సీన్ టీవీలో ప్రత్యక్షమైతే చాలు ఎవరైనా అతుక్కుపోయి కూర్చుండిపోతారు. అంత పవల్​ ఫుల్​గా చేశాడు రవితేజ. కానీ అంతకంటే ముందు ‘వెంకీ’ ఆ తర్వాత పవర్, ఖతర్నాక్, బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు.. పలు చిత్రాల్లో మళ్లీ మళ్లీ ఖాకీ చొక్కాలోనే కనిపించాడు రవితేజ. అంటే రవితేజకు పోలీస్ క్యారెక్టర్ అంటే ఎంత ఇంట్రెస్ట్​ ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు మళ్లీ తన తాజా చిత్రం ‘క్రాక్’లోనూ పోలీస్ క్యారెక్టరే చేస్తున్న రవితేజ.

నెక్ట్స్ చేయబోయే సినిమాలో కూడా ఈ క్యారెక్టరేనట. అయితే ఈ సినిమా ట్విస్ట్ ఏమిటంటే రవితేజ హీరోగా, విలన్​ రెండు డిఫరెంట్ షేడ్స్​లో కనిపిస్తాడట. అందుకే కాన్సెప్ట్​ కు తగ్గట్టు ‘కిలాడీ’ అన్న టైటిను కూడా సజెస్ట్ చేశారని సమాచారం. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా ‘వీర’ సినిమా తీసిన రమేష్ వర్మ డైరెక్షన్ చేస్తున్నాడు. రీసెంట్​గా బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు రమేష్ వర్మ. ఈ సినిమా రవితేజ ఇమేజీకి తగిన విధంగా మాస్ ఎలిమెంట్స్​తో కూడిన ఎంటర్​ టైనర్​గా ఉంటుందట..