సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్ డౌన్ ఎత్తివేత, నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.
- June 9, 2020
- మహబూబ్‌నగర్
- LOCKDOWN
- MAHABUBNAGAR
- కోవిడ్
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- Comments Off on మాస్క్ ఉంటేనే బయటికిరండి