సారథి న్యూస్, ములుగు: మావోయిస్టు కీలకనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్(40) తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చారన్న పక్కా సమాచారంతో ములుగు జిల్లా పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. జిల్లాలోని అడవిని జల్లెడ పడుతున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ, గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. కొత్త వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మావోయిస్టు కీలక నేత దామోదర్‌ను పట్టిచ్చిన వారికి రూ.రెండులక్షల బహుమతిని కూడా ఇస్తామమని పోలీస్ శాఖ ప్రకటన జారీచేసింది. ములుగు జిల్లాలోని ఆయా గ్రామాల్లో దామోదర్ పై ముద్రించిన పోస్టర్లను అంటించారు. దామోదర్ సహా కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాల్లోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
- December 19, 2020
- Archive
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- BADECHOKKARAO
- DAMODHAR
- MAIOST PARTY
- MULUGU
- దామోదర్
- బడే చొక్కారావు
- మావోయిస్టు పార్టీ
- ములుగు
- Comments Off on మావోయిస్ట్ కీలక నేత కోసం పోలీసుల వేట