సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో శనివారం మావోయిస్టు మిలిషియా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన మిడియం చిన్నలక్ష్మయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. మూడేళ్లుగా మిలిషియా సభ్యుడిగా పనిచేస్తూ, ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీకి నిత్యావసర వస్తువులు అందజేస్తూ.. వారు గ్రామానికి వచ్చినప్పుడల్లా వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తూ.. పోలీస్ వారి కదలికలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తుండేవాడిని పోలీసులు వెల్లడించారు. అతడు చూపించిన ప్రదేశాల్లో కార్డెక్స్వైరు, జిలెటిన్ స్టిక్ లు రెండు, రెండు టిఫిన్ బాక్స్ లు, రెండు డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఏటురునాగారం ఏఎస్పీ శరత్ చంద్రపవర్, వెంకటాపురం సీఐ కాగితోజ్ శివప్రసాద్, వెంకటాపురం ఎస్సై తిరుపతి, సీఆర్పీఎఫ్ అధికారి పాల్గొన్నారు.
- October 17, 2020
- Archive
- క్రైమ్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- ALUBAKA
- CHARLA
- MAIOST
- MITILIA MEMBER
- ఆలుబాక
- చర్ల
- మావోయిస్టు
- మిలిషియా సభ్యుడు
- Comments Off on మావోయిస్టు మిలిషియా సభ్యుడి అరెస్ట్