సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: నిషేధిత మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో 17మంది ఇన్ఫార్మర్లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా మావోయిస్టు అగ్రనేతలు హరిభుషణ్, దామోదర్, రాజిరెడ్డి, మైలరపు అడేల్లును కలిసేందుకు చత్తీస్‌గఢ్‌కు వెళ్లి వారికి కావాల్సిన విప్లవ సాహిత్యాన్ని సమకూర్చేందుకు వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అరెస్ట్ అయినవారిలో డబ్బకట్ల సుమన్, చందా మహేష్, తాటిపాముల రమేష్, చిడం జంగుదేవ్, రమణ, గంట సత్యం, కుడిమెట్ల శ్రీనివాస్, మెంతని సంజీవరావు, రడం శ్రీను, సొయం చిన్నయ్య, అతరం బుజంగరావు, అతరం సుగుణ, కనక వెంకటేశ్, మడవి రమేష్, వేడమ బొజ్జు, కురసింగ వెంకటేశ్, సీడం వివేక్ ఉన్నారు. సమావేశంలో ఓఎస్డీ శోభన్ కుమార్, ఏఎస్పీ సాయిచైతన్య, పసర సీఐ శ్రీనివాస్, ఆర్ఐ కిరణ్ కుమార్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
- November 2, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MAOIST
- MULUGU
- TADVAY
- VAJEDU
- ఇన్ఫార్మర్లు
- తాడ్వాయి
- మావోయిస్టు
- వాజేడు
- Comments Off on మావోయిస్టు పార్టీ ఇన్ఫార్మర్ల అరెస్ట్