Breaking News

మావోయిస్టులూ.. విధ్వంసం ఆపండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.