నల్లగొండ, సారథి న్యూస్: పిల్ల నిచ్చిన మామను హత్యచేసిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన చింతల గోపీ ఈ నెల 20న తన కుమారుడు రిత్విక్‌కు పుట్టు వెంట్రుకల వేడుక చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీలోని నందిగామ నుంచి అతడి మామ వంటిపులి వెంకటేశ్వర్లు వచ్చారు. తన కూతురును పుట్టింటికి తీసుకెళ్లేందుకు ఫంక్షన్నం అనంతరం నల్లగొండలోనే ఉండిపోయారు. మరునాడు మామా, అల్లుడు ఇంట్లోనే మద్యం సేవించారు. ఆ సమయంలో తన కూతురును తరుచూ ఎందుకు శారీరకంగా హింసిస్తున్నావంటూ వెంటటేశ్వర్లు.. అల్లుడు గోపీని ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య మాటా మాటా పెరిగింది. విచక్షణ కోల్పోయిన అల్లుడు గోపి.. క్షణికావేశంలో రోలుతో మామ తల మీద బలంగా కొట్టాడు. తీవ్రగాయాల పాలైన వెంకటేశ్వర్లును కూతురు, ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు కుమారుడు ప్రకాశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు సాగించారు. మూడ్రోజుల్లోనే నిందితుడు గోపిని అరెస్ట్ చేశారు.
- June 24, 2020
- Archive
- క్రైమ్
- AP
- CRIME
- NALGONDA
- POLICE
- క్షణికావేశం
- హత్య
- Comments Off on మామను చంపిన అల్లుడు అరెస్ట్