సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్‌నగర్ చౌరస్తా మీదుగా హైదరాబాద్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో దళిత మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా.. యోగి ఆదిత్యనాథ్సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. పశువులకు ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదన్నారు. పశుగ్రాసం కోసం వెళ్లిన దళిత యువతిని రేప్‌చేసి.. నాలుక కోసి.. వెన్ను విరిచి దారుణంగా హత్యచేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు. పాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటుచేసి నిందితులను ఉరితీయాలని డిమాండ్‌చేశారు. ‘చేతగాని సర్కారు దిగిపోవాలని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బహుజన సమాజం మేల్కొవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం, చట్టాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వర్కాల ధనుంజయ్, మల్లేష్, శివ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరశురాములు, బి.రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
- October 2, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- PM MODI
- UTTARPRADESH
- YOGIADITYANATH
- ఉత్తరప్రదేశ్
- ప్రధాని మోడీ
- యోగి ఆదిత్యానాథ్
- హత్రాస్
- Comments Off on మానవ మృగాలను ఉరితీయాలి