సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 44 మందికి కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మానవపాడు -2, కొర్రిపాడు -1, మద్దూరు -2, ఉండవెల్లి మండలంలోని ఉండవెల్లి -1, పుల్లూరు -5, అలంపూర్ క్రాస్ రోడ్డు -2, ఇటిక్యాల మండలంలో – 1 చొప్పున కేసులు నమోదైనట్టు డాక్టర్ దివ్య తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా మాస్కులు కట్టుకోవాలన్నారు. ఎవరికైనా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు.
- August 10, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- CARONA
- GADWAL
- MANOPADU
- TESTS
- కరోనా
- మానోపాడు
- Comments Off on మానవపాడులో కరోనా హైరానా