సారథి న్యూస్, మెదక్: జిల్లాలో మాతా శిశు మరణాలు తగ్గేలా చూడాలని వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి కలెక్టర్ఎం.ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా ఆస్పత్రుల డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ఎప్పడికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా రక్తం ఉండేలా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, ఈవోఎంహెచ్ఎన్ సుమిత్రారాణి, అదనపు జిల్లా వైద్యాధికారి రాజు, జిల్లా సర్వేలైన్స్ ఆఫీసర్ డాక్టర్ మల్కాజి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
- July 25, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- medak
- REVIEW MEETING
- కలెక్టర్
- మెదక్
- Comments Off on మాతా, శిశు మరణాలు తగ్గించాలి