సారథి న్యూస్, కర్నూలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ పూర్తిస్థాయిలో నష్టపోయిందని, అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. సీఆర్‌డీఏ బిల్లు రద్దు.. మూడు రాజధానులకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసినందుకు.. శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరుపుకున్నారు. భావితరాల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- August 1, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- AMARAVATHI
- CM JAGAN
- Kurnool
- అమరావతి
- మూడు రాజధానులు
- సీఎం జగన్
- Comments Off on మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు