సారథి న్యూస్, కొల్లాపూర్: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావుకు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర కొల్లాపూర్ పట్టణంలో కొనసాగించారు. పట్టణంలోని మినీ స్టేడియంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. ప్రజలు వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, టీడీపీ వర్గీయులు, ఆయన బంధుమిత్రులు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో అంతిమయాత్ర కొనసాగింది. కొల్లాపూర్ నుంచి తన స్వగ్రామం నార్లపూర్ కు తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ యువ నాయకులు రంగినేని అభిలాషరావు, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్‌గల్, కోడేర్, వీపనగండ్ల, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, చిన్నంబాయి, కొల్లాపూర్ మండలాల్లోని టీఆర్ఎస్ నాయకులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
- December 16, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- EX MLA KATIKANENI
- JUPALLY
- KOLLAPUR
- NARLAPUR
- కొల్లాపూర్
- జూపల్లి
- నార్లపూర్
- బీరం హర్షవర్ధన్‌రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే కటికనేని
- Comments Off on మాజీ ఎమ్మెల్యే కటికనేనికి కన్నీటి వీడ్కోలు