సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సంతాపసభను గురువారం స్థానిక సీకేఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ ఎంపీలు పి.రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, మాజీమంత్రి చిత్తరంజన్‌దాస్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి జడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్, మార్కెట్‌కమిటీ చైర్మన్ బాలయ్య, అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
- August 27, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- EXMLA
- KALWAKURTHY
- NAGARKURNOOL
- YADMA KISTAREDDY
- ఎడ్మ కిష్టారెడ్డి
- కల్వకుర్తి
- నాగర్‌కర్నూల్
- మాజీ ఎమ్మెల్యే
- Comments Off on మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డికి ఘననివాళి