సంవత్సరం ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో రష్మిక కెరీర్ మాంచి ఊపు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ భాషా ఈ భాషా అని బేధం లేకుండా అన్ని భాషల్లో నటించేస్తోంది ఈ కన్నడ భామ. టాలీవుడ్లో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ చాన్స్ దక్కించుకుంది. కన్నడలో రష్మిక చేసిన ‘పొగరు’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ మూవీకి కమిటైంది.
వరుస ఆఫర్లు ఇలా ఉండగా ఆ మధ్య కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ 65వ సినిమాలో రష్మిక హీరోయిన్ చాన్స్ కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రంలో రష్మిక హీరోయిన్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలో ఓసారి విజయ్ సినిమా ‘మాస్టర్’లో కూడా రష్మిక హీరోయిన్ రోల్ చేస్తుందనే న్యూస్ తెగ వైరల్ అయింది. కానీ అప్పుడా సినిమాలో నటిచడం లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ సారి మాత్రం రష్మిక, విజయ్‌లు ఇద్దరూ జంటగా కనిపించనున్నారన్న వార్త గట్టిగా వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.