మహేష్ బాబు, పరుశరామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ఎంపికకు సంబంధించి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కీర్తి సురేష్ ఫైనల్ అయిందన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ కీర్తి ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కన్ఫర్మ్ చేసింది.
అయితే కొద్దిరోజులుగా ఆమె ప్లేస్ లో మరొకరిని తీసుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో కీర్తి ఈ చిత్రంలో నటిస్తోందా? లేదా? అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అసలు వాస్తవం ఏమిటంటే అమెరికాలో ఈ సినిమా షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇలా హీరోయిన్ మార్పు ఏమిటి.. అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది. కానీ కీర్తి యూఎస్ షెడ్యూల్ కోసం మహేష్ మూవీ టీమ్ వీసా కూడా అప్లై చేశారని తెలుస్తోంది. దీంతో కీర్తి ఈ సినిమాలో నటించడం లేదనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదనిపిస్తోంది. ఇక కీర్తి నటించిన తెలుగు సినిమాలు ‘గుడ్‌లక్ సఖి’, ‘మిస్ ఇండియా’ సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.