మహేశ్ అభిమానులకు ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఈనెల 9న చిత్రయూనిట్ టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కీర్తీ సురేశ్‌తోపాటు , మరో కథానాయిక కూడా మహేశ్‌తో ఆడిపాడనున్నది. దీంతో పాటు మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.