ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 9,895 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,502కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మహారాష్ట్రలో 12,854 మంది మృతిచెందారు. గత 24 గంటల్లోనే 298 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్పటివరకు 1,94, 253 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని కొందరు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు, నాలుగు వారాల్లో వ్యాధి తీవ్రత మరిత పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
- July 24, 2020
- Archive
- జాతీయం
- CARONA
- DEATH
- MUMBAI
- NEWCASES
- కరోనా
- మహారాష్ట్ర
- Comments Off on మహారాష్ట్రలో 9వేల కొత్తకేసులు