Breaking News

మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవాలి

మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవాలి

  • ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య

సారథి న్యూస్​, ములుగు: మహాత్మాగాంధీ మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ లో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలు లేకుండా దేశం అభివృద్ధిపథంలో నడిపేందుకు కృషిచేసిన గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి అని అన్నారు. సత్యం, అహింసా, ధర్మం మార్గాల్లో నడిచిన బాపూజీ కుల, మత, వర్గ విభేదాలు లేని అభివృద్ధి చెందిన భారత దేశాన్ని కలలు కనడమే కాకుండా అందుకు కృషిచేసి అమరులయ్యారని కొనియాడారు. అందుకే గాంధీజీని నేటికి ప్రపంచవ్యాప్తంగా అందరి మదిలో ఉన్నారని, వారిని జాతిపితగా కొలుస్తామన్నారు. సామాజిక మార్పు కోసం ఆయన అహర్నిశలు శ్రమించారని, గాంధీ చూపిన బాటలో నడవడానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి, ములుగు మండల తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, కలెక్టరేట్ డీటీ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.