Breaking News

‘మహబూబా ముఫ్తీని రిలీజ్‌ చేయాలి’

‘మహబూబా ముఫ్తీని రిలీజ్‌ చేయాలి’

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. కాశ్మీర్‌‌లోని నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. పీడీపీ చీఫ్‌ మహబూబా ముఫ్తీని రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రాజకీయ నాయకులను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. డిటెన్షన్‌లో ఉన్న మెహబూబా ముఫ్తీని వెంటనే రిలీజ్‌ చేయాలి’ అని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. గతేడాది ఆగస్టు 5న కాశ్మీర్‌‌లో 370 ఆర్టికల్‌ రద్దు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారిలో మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు. కాగా, కొంతమంది లీడర్లను రిలీజ్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం మెహబూబా ముఫ్తీకి మరో మూడు నెలలు డిటెన్షన్‌ను పొడగించింది.