ప్రముఖ మళయాళ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. ఆనంతరం అరోగ్యపరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 2007లో మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. ‘రన్ బేబీ రన్’,‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ వంటి చిత్రాలకు సచీ ఒక్కరే కథ, దర్శకత్వం వహించారు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ మీనన్ నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానున్నది. సితార ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్ర హక్కులను దక్కించుకున్నారు. సచీ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ, ఇతర సినీరంగ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు.
- June 20, 2020
- Archive
- సినిమా
- FILM
- MALAYALAM
- SACHI
- గుండెపోటు
- సచ్చిదానందన్
- Comments Off on మళయాళ దర్శకుడు సచీ కన్నుమూత