సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఆదివారం దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్కె.ఫక్కీరప్ప, జేసీ రవి పట్టన్ శెట్టి, ఈవో రామారావు తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవారి మహామంగళ హారతి సేవలో పాల్గొన్నారు. అనంతరం వ్యూ పాయింట్‌నుంచి శ్రీశైలం జలాశయం, పరిసర ప్రకృతి అందాలను తిలకించారు. అక్కడే ఉన్న మ్యూజియంలోకి వెళ్లి శ్రీశైలం జలాశయ నిర్మాణ నమూనాను పరిశీలించారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం, నీటి నిల్వ వివరాలను చీఫ్‌జస్టిస్‌కు జలవనరులశాఖ ఇంజనీర్లు వివరించారు.
- August 30, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- AP HIGHCOURT
- CHIEF JUSTICE
- Kurnool
- MALLIKARJUNASWAMY
- SRISAILAM
- కర్నూలు
- చీఫ్‌జస్టిస్
- మల్లికార్జునస్వామి
- శ్రీశైలం
- Comments Off on మల్లికార్జునుడి సన్నిధిలో ఏపీ హైకోర్టు చీఫ్‌జస్టిస్