సారథిన్యూస్, హైదరాబాద్: అన్ని రంగాలవారిని కరోనా వణికిస్తున్నది. వైద్యులు, జర్నలిస్టులు, రాజకీయనాయకులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఓ తెలుగు సీరియల్ నటుడికి కరోనా సోకింది. లాక్డౌన్ సడలింపులతో టీవీ సీరియల్స్ షూటింగ్ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓ టీవీ సీరియల్ దర్శకుడికి కరోనా సోకగా తాజాగా గృహలక్ష్మి సీరియల్ నటుడు హరికృష్ణకు కరోనా సోకింది. దీంతో శుక్రవారం జరగాల్సిన ఈ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేశారు. ఇటీవలే కరోనా సోకిన టీవీనటుడు ప్రభాకర్‌తో హరికృష్ణ కాంటాక్ట్ అయ్యాడు. అయితే ప్రభాకర్‌తో సన్నిహితంగా మెలిగిన 33 మందికి సంబంధించిన రిపోర్టులు రాకుండానే షూటింగ్ మొదలు పెట్టడం గమనార్హం. ఇక ఇన్సూరెన్స్ చేయించడంలో అలసత్వం పాటించడంతో టీవీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- June 26, 2020
- Archive
- సినిమా
- ACTOR
- CARONA
- HYDERABAD
- SERIAL
- జర్నలిస్టులు
- వైద్యులు
- Comments Off on మరో సీరియల్ నటుడికి కరోనా