Breaking News

మరో యువనటుడు సూసైడ్​

యువనటుడు అశ్​తోష్​ బక్రే

బాలీవుడ్​ యువ హీరో సుశాంత్​ సూసైడ్​ ఘటనను మరువకముందే.. మరో యువ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరాఠీ యువ నటుడు అశుతోష్​ భక్రే (32) గురువారం నాంధేడ్​లోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతికి గల కారణాలు తెలియరాలేదు. 2016లో ఆయన టీవీ నటి మయూరీ దేశ్​ముఖ్​ను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా పలు మరాఠా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరినీ చిత్రపరిశ్రమ మేడ్​ ఫర్​ ఈచ్ ​అదర్​గా అభివర్ణించేవారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోతోష్​ మృతికి చిత్రపరిశ్రమ సంతాపం తెలిపింది.