న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్ పైలెట్, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్ చేసిన లిస్ట్‌లో ఉంది. సొంతపార్టీపై తిరుగుబాటు చేసినందుకు సచిన్‌పైలెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దాన్ని సవాలు చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేయగా.. ఈ నెల 24వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది. దాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. దాన్ని మళ్లీ హైకోర్టుకు ఇస్తూ టాప్ కోర్టు చెప్పింది. హైకోర్టులో సచిన్ పైలెట్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో దాన్నిసవాలు చేస్తూ స్పీకర్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
- July 25, 2020
- Archive
- Top News
- జాతీయం
- JAIPUR
- RAJASTHAN
- SACHIN PILOT
- SUPRIMCOURT
- రాజస్థాన్
- సుప్రీం
- Comments Off on మరోసారి సుప్రీంకోర్టుకు