Breaking News

‘మన్‌ కీ బాత్‌’ కోసం ఐడియాస్​ ఇవ్వండి

న్యూఢిల్లీ: ఈ నెల 28న జరిగే మన్‌ కీ బాత్‌లో మాట్లాడేందుకు ఐడియాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. తమ ఐడీయాలను నమో యాప్‌లో, మై జీవోవీ ఓపెన్‌ ఫోరంలో లేదా1800-11-7800 నంబర్‌‌ ద్వారా రికార్డ్‌ చేయాలని మోడీ ట్వీట్‌ చేశారు. ‘ఈ నెల 28న మన్‌ కీ బాత్‌ జరుగుతుంది. రెండు వారాలు ఉన్నప్పటికీ దయచేసి మీ ఆలోచనలు ఇవ్వండి. కరోనాతో పోరాడడం, దాని కంటే ఇంకా ఎక్కువ మీరు చెప్పాల్సింది కచ్చితంగా ఉందని అనుకుంటున్నాను. మీ ఆలోచనలు ఎప్పుడూ మన్‌ కీ బాత్‌కి బలం ఇస్తాయి. ఇది 130 కోట్ల మంది ఇండియన్స్‌ బలాన్ని ప్రదర్శించే ఒక శక్తిమంతమైన వేదికగా నిలిచింది’ అని మోడీ ట్వీట్‌ చేశారు.

ప్రతినెలా చివరి ఆదివారం మోడీ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియో ద్వారా ‘మన్‌ కీ బాత్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో పోయిన నెలలో జరిగిన ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన కరోనా గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని తగ్గించొద్దని, సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వేసుకుంటూ, చేతులు కడుక్కుంటూ ప్రభుత్వం ఇచ్చిన ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని మోడీ ప్రజలకు సూచించారు.