సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా బారినపడి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన మనోజ్‌కుమార్ మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని టీయూడబ్ల్యూజే టీజేఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద మనోజ్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వట్టికొండ రవి, లక్ష్మణ్ నరసింహారావు, రాజేష్, మోటమర్రి రామకృష్ణ, మహమ్మద్ షఫీ, ప్రభాకర్ రెడ్డి, సిమకుర్తి రామకృష్ణ ,పాపారావు, జై కిసాన్ రాజు, సదానందం, రమేశ్, మురళి, శివ, ప్రతాప్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- June 13, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- JOURNALIST
- KOTHAGUDEM
- MANOJ
- TUWJTJF
- జర్నలిస్టు
- Comments Off on మనోజ్‌కు ఘన నివాళి