సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వ్యాపారాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న ఆంక్షలు యథాతథంగా అమలవుతాయని కమిషనర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాల్లో వ్యాపారాల నిర్వహణ సాగుతోందని, ఈ సమయం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆన్ లాక్ 4.0 మార్గదర్శకాలు కేవలం నాన్ కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేశారు. మెడికల్, అత్యవసర వైద్య సంబంధిత దుకాణాలకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని తెలిపారు.
- September 3, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- CONTAINMENT ZONES
- Kurnool
- POSITIVE CASES
- ఆన్ లాక్ 4.0
- కంటైన్మెంట్జోన్లు
- కర్నూలు
- పాజిటివ్కేసులు
- Comments Off on మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు