Breaking News

మట్టి తరలింపును అడ్డుకోండి

సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యుడు గడిపె మల్లేశ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, రాష్ట్ర రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హన్మిరెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు లక్ష్మి నారాయణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.